చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ హిట్ తర్వాత, ఆయన ఇప్పుడు ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ‘భోగి’ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. సాధారణంగా టీజర్ లేదా ట్రైలర్ చూశాకే ఓటీటీ డీల్స్ కుదుర్చుకునే ఈ రోజుల్లో, షూటింగ్ దశలోనే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమాను కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపత్ నంది మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.
