న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల ‘యేష నాగుల కట్ట’ అనే ప్యూర్ ఫోక్ మాస్ బీట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ పాట ఇచ్చిన విజయం చిత్రబృందానికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అయితే, పాట లిరికల్ వీడియోలో ఆట సందీప్ అందించిన కొరియోగ్రఫీపై మాత్రం సోషల్ మీడియాలో కొంత మిక్సిడ్ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది. నాని, కీర్తి సురేష్‌లలో ఉన్న ఎనర్జీకి తగ్గట్టుగా ఇంకొంచెం హై-వోల్టేజ్ మాస్ డాన్స్ మూమెంట్స్ ఉంటే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.
ఈ విమర్శలపై కొరియోగ్రాఫర్ ఆట సందీప్ స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అసలైన ఊరమాస్ డాన్స్ మూమెంట్స్ మరియు సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను లిరికల్ వీడియోలో దాచిపెట్టామని, వాటిని కేవలం సినిమాలోనే చూడగలరని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ 24న విడుదల కానున్న థియేటర్ వర్షన్‌పై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. బిగ్ స్క్రీన్‌పై ఆట సందీప్ దాచిపెట్టిన ఆ మాస్ మూమెంట్స్ ప్రేక్షకులను మెప్పించి సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయో లేదో చూడాలి.


