చరణ్ నెక్స్ట్ సినిమాపై ఆగని రూమర్స్.!

Ram Charan 2

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ స్టార్ హీరోల్లో దాదాపు అంతా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లతో వరుసగా అదిరిపోయే లైనప్ లను పెట్టుకున్నారు. కానీ ఒక్క మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇంకా తాను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో ఇంకా సస్పెన్స్ నే ఉంచారు. దీనితో చరణ్ తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే పలువురు టాప్ దర్శకులు పేర్లు చరణ్ నెక్స్ట్ పై వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పుడు మరో స్టార్ దర్శకుడు పేరు కూడా రేస్ లోకి వచ్చింది. “రంగస్థలం” అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తో చరణ్ మళ్ళీ ఒక సినిమా చేస్తాడని రూమర్స్ మొదలయ్యాయి.

అలాగే ఈ చిత్రం కంటే ముందు చరణ్ ఓ సినిమా చేసేస్తాడని ఆ తర్వాతే సుక్కుతో ఉంటుంది అని గాసిప్స్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ చరణ్ చేసే తర్వాతి ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ కోసం తన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ రాజమౌళితో “RRR”, కొరటాల శివ మరియు మెగాస్టార్ కాంబోలో వస్తున్న “ఆచార్య”లో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version