
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో బ్యూటిఫుల్ సమంత ఒకరు. సమంత హీరోయిన్ గా నటించిన ‘అల్లుడు శీను’ జూలై 25న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సమంత తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది.
సమంత మాట్లాడుతూ ‘నాకు ఎక్కువగా ఎ సెంటర్స్ లోనే ఫాలోయింగ్ ఉంది కానీ అల్లుడు శీను సినిమాతో నాకు బి,సి సెంటర్స్ లో మంచి ఫాలోయింగ్ వస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా అయినా ఫస్ట్ డే నుంచి చాలా కాన్ఫిడెంట్ గా షూటింగ్ లో పాల్గొన్నాడు. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉన్న కుర్రాడు. తన కెరీర్ పై బాగా క్లారిటీ ఉన్న హీరో. అలాగే సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అనుకోలేదు. ఇత పెద్ద హిట్ అచేసిన అందరికీ నా థాంక్స్ అని’ తెలిపింది.
త్వరలోనే సమంత హీరోయిన్ గా నటించిన ‘రభస’ మరియు ‘అంజాన్’ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ‘ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘రభస’ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ అంజాన్ విషయంలో కాన్ఫిడెంట్ కంటే కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే తమిళంలో నేను చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత తమిళంలో పెద్ద సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అందులో ముందుగా అంజాన్ వస్తోంది. అందుకే నేను రభస కంటే అంజాన్ విషయంలో టెన్షన్ గా ఉన్నానని’ తెలిపింది.
అలాగే మాట్లాడుతూ ‘నా టార్గెట్ ఏంటి అంటే సమంత ఇలాంటి పాత్రలు చేయలేందు, గ్లామర్ రోల్స్ తనకి సూట్ కావు అనే మాటలు వినపడకూడదు. సమంత అంటే తను ఎలాంటి పాత్ర అన్నా చెయ్యగలదు అనే అందరూ మాట్లాడుకోవాలని’ తన మనసులో మాట చెప్పింది.