విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం ఎటువంటి హడావిడి లేకుండా అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అధికారిక ప్రకటనను మరికొంత కాలం వేచి చూసి ఇచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, వేసవి నుండే ప్రమోషన్స్ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
సినిమా కథనం విషయానికొస్తే, ఇది కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా AK47 తరహాలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుందని సమాచారం. ఇంటర్వెల్ వరకు సినిమా అంతా ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి వింటేజ్ వెంకీ చిత్రాల తరహాలో కడుపుబ్బ నవ్వించే వినోదంతో సాగుతుంది. అయితే, ఇంటర్వెల్ వద్ద ఇచ్చే ఒక పెద్ద ట్విస్ట్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తుందని, అక్కడి నుండి కథ సీరియస్ మోడ్‌లోకి మారుతుందని తెలుస్తోంది.
సినిమా సెకండ్ హాఫ్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలోని మలుపులను గుర్తుకు తెస్తుందని సమాచారం. గత చిత్రం ‘గుంటూరు కారం’ సమయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో వర్కవుట్ అయిన క్లాస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
