అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్న కొరటాల ?

Koratala Siva

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, మొదట ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇటీవల బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. ఆయన కోలుకున్న తర్వాతే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. అక్టోబర్ నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను కీలక పాత్ర కోసం తీసుకున్నారట.

నిజానికి మొదట బాలయ్య లేని సీన్స్ ను షూట్ చేయాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version