
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటి ‘స్వామి రారా’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిస్తున్న షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజగా ఈ చిత్రా టీం ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఆడియోని ఏప్రిల్ 26న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాని మై లో రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. అంతే కాకుండా ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లో మంచు మనోజ్ గెస్ట్ రోల్ లో కూడా కనిపించనున్నాడు. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని చక్రి చిగురుపాటి అంటున్నారు. ఇదిలా ఉంటే సుధీర్ బాబు – నందిత జంటగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.