సెన్సార్ కి సిద్దమైన ‘మోసగాళ్ళకు మోసగాడు’

Mosagallaku-Mosagadu (1)
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటి ‘స్వామి రారా’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిస్తున్న షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. స్వామి రారా సినిమాకి మోసగాళ్ళకు మోసగాడు సినిమాకి కథా పరంగా ఎలాంటి సంబందము ఉండదు. కేవలం విగ్రహాల చోరీ ఒక్క పాయింట్ మాత్రమే కామన్ గా ఉంటుందని సుధీర్ బాబు తెలియజేశాడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 22న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తుంది. ఫైనల్ కాపీని సిద్దం చేసుకున్న ఈ చిత్ర టీం రేపు మోసగాళ్ళకు మోసగాడు సినిమాని సెన్సార్ కి పంపనుంది. వారం రోజుల ముందే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉండాలని చక్రి ప్లాన్ చేస్తున్నాడు. సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లో మంచు మనోజ్ గెస్ట్ రోల్ లో కూడా కనిపించనున్నాడు. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని చక్రి చిగురుపాటి అంటున్నారు.

Exit mobile version