సాయి ధరమ్ తేజ్ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాణంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇంటిలిజెంట్. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో చమకు చమకు పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసారు. థియేటర్స్ లో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుందని నిర్మాత తెలిపాడు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని రాసుకోవడం జరిగిందని తెలుస్తోంది. 2014లో హైదరాబాద్ కుకట్ పల్లి లో జరిగిన విద్వంసం అందరికి తెలుసు. ఆ సంఘటనలు ఈ సినిమాలో క్లుప్తంగా చూపించడం జరిగింది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు కామిడి ఈ సినిమాలో బాగా పండిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
