ఓటీటీ అలర్ట్ : ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT-Movie-March-02

మార్చి నెల ప్రారంభం కావడంతో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు అదనంగా మరింత ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సినిమాలేమీ లేకపోవడంతో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ వైపే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇక మార్చి తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏమిటో ఇక్కడ చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 6
వార్ మెషీన్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 6
హలో బచ్చోన్ (హిందీ సిరీస్) – మార్చి 6

జియో హాట్‌స్టార్ :

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) – మార్చి 6

అమెజాన్ ప్రైమ్ వీడియో :

తన్వి ది గ్రేట్ (హిందీ మూవీ) – మార్చి 3
యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 4
సుబేదార్ (హిందీ మూవీ) – మార్చి 5

ఆహా :

ఓం శాంతి శాంతి శాంతిః – మార్చి 4

జీ5 :

గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 6
జబ్ ఖులీ కితాబ్ (హిందీ మూవీ) – మార్చి 6

సోనీ లివ్ :

లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) – మార్చి 6

Exit mobile version