
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించి రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఏ టైటిల్ అనేది ఖరారు కాలేదు.
మేము తాజాగా విన్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాకి ‘మిస్టర్ దేవుడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ టైటిల్ అనుకుంటున్నారు కానీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ జోడీ కట్టనుంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శరత్ మరార్ – సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.