ప్రచారంలో జోరుగా పాల్గుంటున్న ‘ముకుంద’

mukunda-us-list
‘ముకుంద’ సినిమా విడుదల తేది దగ్గరపడే కొద్దీ చిత్ర బృందం ప్రచారం పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. నిన్నటి వరకూ ‘ముకుంద’ సినిమా ప్రచారానికి కాస్త దూరంగా వున్నా మెగా ఫ్యామిలీ నుండి ప్రిన్స్ గా వస్తున్న వరుణ్ తేజ్ నిన్నటి నుండి పలు మీడియా సంస్థలకు తన హీరోయిన్ పూజ హేగ్దేతో కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చాడు

దీనికి తోడు టి.వి లో ప్రమోషన్ లు సైతం పెంచడంతో చిత్ర బృందం ఆనందంలో వుంది. వీటి వలన ఈరోజు రేపట్లో అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగే అవకాశం వుంది. ఇప్పటికే పలు మల్టీప్లెక్స్ షోలలో ‘ఫాస్ట్ ఫిల్లింగ్’ స్టేటస్ లు కనబడుతున్నాయి. వీటిన్నటికి సినిమాలో సమకూర్చిన మధురమైన పాటలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి

అంతర్లీనంగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ అడ్డాల ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నల్లమలపు బుజ్జి, మధుల నిర్మాణంలో విడుదలచేయనున్నారు.

Exit mobile version