
2007లో వచ్చిన ముని సినిమా గుర్తుంది కదా! లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని బాగానే భయపెట్టింది. ఎంత భయ పెడితే అంత సొమ్ము చేసుకోవచ్చు అనే సూత్రం ఫాలో అయిన లారెన్స్ ఆ తరువాత కొంత కాలం ఆగి ముని సినిమాకి సీక్వెల్ గా 2011లో కాంచన అనే సినిమాను రూపొందించాడు. ముని కంటే కాంచన సినిమాలో ఎక్కువ భయపెట్టి దానిని మించిన హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాల్లో లారెన్స్ డైరెక్షన్ తో పాటుగా హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాలకి సీక్వెల్ గా ముని 3 సినిమా తీయబోతున్నాడు. ముని, కాంచన ఈ రెండు సినిమాలు తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేయగా ముని 3ని మాత్రం తెలుగులో తీయడం విశేషం. కాంచన సినిమాని తెలుగులో విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముని 3 సినిమాని నిర్మించనున్నారు. ముని 3 పూజ కార్యక్రమాలతో రేపే షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి రెండు సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా లారెన్స్ భయపెడతాడేమో చూద్దాం.
ముని -3 రేపే ముహూర్తం
ముని -3 రేపే ముహూర్తం
Published on Dec 18, 2012 12:55 PM IST
సంబంధిత సమాచారం
- బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన అయ్యగారి 100 కోట్ల బొమ్మ!
- టాలీవుడ్ పై మరోసారి బాలీవుడ్ స్టార్ దర్శకుడు అక్కసు.. ఎందుకిలా అయ్యాడు!
- OTT: తెలుగుతో సహా 4 భాషల్లో విజయ్ ‘జననాయగన్’ ఓటీటీ ప్రీమియర్.. ఆగస్టు 21 నుంచే స్ట్రీమింగ్!
- రవితేజ ‘ఇరుముడి’కి సాలిడ్ ఓపెనింగ్స్: హైదరాబాద్, వైజాగ్‌లలో హౌస్‌ఫుల్స్‌తో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
- ట్రెండ్ సెట్టర్ రామ్ చరణ్.. తన వల్లే ఇలాంటి సినిమాలన్నీ!
- బుక్ మై షోలో ‘టాక్సిక్’కి వేరే లెవెల్ హైప్.. రియాలిటీలో మరి?
- యూఎస్ మార్కెట్ లో రికార్డు మైల్ స్టోన్ క్రాస్ చేసేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అజయ్ భూపతి లవ్ స్టోరీ “శ్రీనివాస మంగాపురం”
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

