సిందూరం ‘శ్రీ’ కన్నుమూత

సిందూరం ‘శ్రీ’ కన్నుమూత

Published on Apr 18, 2015 10:00 PM IST

sri
దివంగత సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు శ్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్రీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింధూరం, గాయం, పోలీస్ బ్రదర్స్ అమ్మోరు, ఆడు మగాడ్రా బుజ్జీ, అనగనగా ఒకరోజు, సాహసం వంటి పలు విజయవంతమైన చిత్రాలకు శ్రీ సంగీతం అందించారు. శ్రీ చివరిసారిగా అప్పు ది క్రేజీ బాయ్ అనే చిత్రానికి సంగీతం అందించారు. శ్రీ సంగీత దర్శకుడి గానే కాకుండా ఒక మంచి గాయకుడిగా కూడా ప్రపంచానికి పరిచయం ఉన్నది. 2005 లో వచ్చిన చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది అనే పాటను పాడారు శ్రీ.

ఇక శ్రీ మరణం పట్ల పలువురు సిని ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

తాజా వార్తలు