
జి.వి ప్రకాష్ తమిళ మరియు తెలుగు సినిమాలకు ఇటీవల కాలంలో మంచి మ్యూజిక్ హిట్స్ అందించి యువత మనసు గెలుచుకున్నాడు. ఇటీవల ప్రకాష్ నటుడి రూపం ఎత్తి తమిళనాట పలు హిట్లు కూడా అందుకోవడం విశేషం. తాజాగా తను నటించిన ‘త్రిష ఇల్లనా నయనతార(త్రిష లేదా నయనతార)’ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.
తాజా సమాచారం ప్రకారం తన తదుపరి చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ని ఖరారు చేశాడు. కొత్త దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదలై నెట్ లో సంచలనం సృష్టిస్తుంది. ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభంకానుంది.