క్లాసికల్ డాన్స్ మ్యూజిక్ కి శ్రీకారం చుట్టిన మాస్ట్రో ఇళయరాజా

క్లాసికల్ డాన్స్ మ్యూజిక్ కి శ్రీకారం చుట్టిన మాస్ట్రో ఇళయరాజా

Published on Dec 25, 2014 4:00 PM IST

ilayaraja
ఇండియన్ సంగీత ప్రపంచంలో తనకంటూ ఎనలేని కీర్తి గడించిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా. ఇళయరాజా త్వరలోనే తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పనున్నాడు. సంగీతంలో జీనియస్ అనిపించుకున్న ఇళయరాజా మొదటిసారిగా ‘స్వప్పనం – డాన్స్ థియేటర్స్ మరియు డ్రీమ్స్’ అనే ఓ గ్రాండ్ డాన్స్ ప్రొడక్షన్ కి సంగీతం అందించనున్నాడు. కార్తీక సుబ్రమణియన్ నేతృత్వంలో థియేటర్ పెర్ఫార్మన్స్ తో కూడా కూడిన ఓ భరతనాట్యం ఈవెంట్ జరగనుంది.

ఈ ప్రొడక్షన్ నుంచి రానున్న మొదటి షో డిసెంబర్ 28న చెన్నైలో లాంచ్ కానుంది. ఇళయరాజా ప్రస్తుతం తెలుగులో ‘రుద్రమదేవి’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిగా ఈ క్లాసికల్ మ్యూజిక్ పై దృష్టి సారించనున్నాడు. ‘రుద్రమదేవి’ సినిమా 2015 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు