నా ఫేవరేట్ స్టార్ ప్రభాస్ – శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer prabhas copy

బాహుబ‌లి సిరీస్ అండ్ ‘సాహో’ చిత్రాలతో నేషనల్ స్టార్ అయిపోయాడు రెబల్ స్టార్ ‘ప్రభాస్‌’ తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు మిగిలిన ఇండస్ట్రీస్ లో కూడా తనకంటూ ఘనమైన స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు ప్రభాస్. అందుకు నిదర్శనమే తాజాగా టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ చేసిన ట్వీట్ నే కారణం. ఓ నెటిజన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అని అడగగా.. నా ఫేవరేట్ స్టార్ ప్రభాస్ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.

ఇక శ్రేయాస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానాన్ని ఎలా భర్తీ చేయాలనీ తలపట్టుకున్న సమయంలో శ్రేయాస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. నిలకడైన ఆటతీరుతో.. ఇచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా నాలుగో స్థానానికి కూడా శ్రేయాస్ చక్కగా సరిపోతాడని అటు కోచ్, ఇటు కెప్టెన్ కూడా పలు సందర్భాల్లో అయ్యర్‌ పై ప్రశంసలు కురిపించారు.

Exit mobile version