టాలీవుడ్లో ఆరడుగులకు పైనే పొడవు, అందుకు తగ్గట్టుగానే కండపుష్టి కలిగిన హీరోల్లో రానా మొదటి స్థానంలో ఉంటారు. తన ఫిజిక్, యాక్టింగ్‌తో ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతటికీ పరిచయస్థుడైపోయారు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ కొత్త కొత్త పాత్రతో మెప్పిస్తున్న ఆయన ‘బాహుబలి’ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’లో రానా విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ‘బాహుబలి’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. “బాహుబలి నా కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమాలో భల్లాలదేవ అనే పాత్రలో కనిపిస్తా. ఇలాంటి ఒక విలన్ పాత్ర చేయడం నా అదృష్టం. దేశంలోనే గుర్తుంచుకోదగ్గ విలన్ పాత్రగా బాహుబలి సినిమాలోని నా పాత్ర నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను” అన్నారు. ప్రస్తుతం రానా మళయాల సినిమా ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్‌లో ఓ హీరోగా నటిస్తున్నారు.
