ఊహించని ట్విస్ట్‌తో క్లైమాక్స్.. ‘మిస్టీరియస్’ హైలైట్స్ ఇవే – డైరెక్టర్ మహి

mahi

రోహిత్, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’. అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

రొటీన్ ఫార్మాట్‌కు భిన్నంగా క్రైమ్, లవ్, సస్పెన్స్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. సినిమా ఆద్యంతం ‘కిల్లర్ ఎవరు?’ అనే ఉత్కంఠతో సాగుతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. థ్రిల్లర్ అయినప్పటికీ కథానుగుణంగా ఎంఎల్ రాజా సంగీతంలో మూడు పాటలు, ఒక భారీ ఫైట్ సీన్ ఉన్నాయని, ఇవి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయని తెలిపారు.

ఇటీవల విడుదలైన పోలీస్ గీతాన్ని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆవిష్కరించారని, బ్రహ్మానందం ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందని గుర్తు చేశారు. ‘అఖండ 2’ రిలీజ్ కారణంగా వారం ఆలస్యంగా, డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.

Exit mobile version