మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. హీరో ఎవరంటే..?

Mtri

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మరియు ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ హిట్లను అందుకున్న ఈ సంస్థ, తాజాగా తమ మూడవ తమిళ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ నిర్మాణ సంస్థ, ఈసారి కూడా ఒక భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రముఖ నటుడు సూరి ఈ కొత్త చిత్రంలో లీడ్ రోల్ చేయనున్నాడు. ‘మామన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూరి, హీరోగా నటిస్తున్న ఏడవ చిత్రం ఇది. విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను బట్టి చూస్తుంటే, ఇది ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. కామెడీ పాత్రల నుండి హీరోగా మారిన సూరి, ఈ సినిమాతో తన మాస్ ఇమేజ్‌ను మరింత బలపరుచుకోవాలని చూస్తున్నాడు.

‘అయలాన్’ వంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆర్. రవికుమార్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.

Exit mobile version