పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వేసవిలో ప్రభాస్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ కెరీర్లో క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘డార్లింగ్’ చిత్రం నిలిచింది. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ మూవీ 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక 16 సంవత్సరాల తర్వాత ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో రీ-రిలీజ్కు రెడీ అయింది. ఏప్రిల్ 23న ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్, కాజల్ క్యూట్ పెయిర్ ప్రేక్షకుల్లో సాలిడ్ ఇంపాక్ట్ వేసుకుంది. ఈ సినిమా మ్యూజిక్ హిట్గానూ నిలిచింది. మరి ఈ చిత్రానికి మరోసారి ప్రేక్షకులు పట్టం కట్టడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
