ఎన్‌.శంక‌ర్ చేతుల‌ మీదుగా `వైదేహి` !

vaidehi

ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్టివ్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎ.జి.ఆర్‌.కౌశిక్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం ‘వైదేహి’. ఎ.జ‌న‌ని ప్ర‌దీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ జ‌న‌వ‌రి 2న ఆయ‌న‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా రామానాయుడు స్టూడియోలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌.శంక‌ర్ గారి చేతుల మీద‌గా ట్రైల‌ర్ లాంచ్ మ‌రియు సీనియ‌ర్ పాత్రికేయులు రామారావుగారితో కేక్‌ను క‌ట్ చేయించారు.

విలేక‌రుల స‌మావేశంలో ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ.. ఎవిఎస్‌గారు నాకు మంచి మిత్రులు చాలా మందితో మంచి అనుబంధం ఉన్నా నాతో ఒక ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అంద‌రితో చ‌క్క‌గా క‌లిసిపోతారు. ఆయ‌న‌కు ఉన్న సినిమా, సాహిత్యం అన్నీ ఓ ప‌ట్టుప‌ట్టారు. 90శాతం ఇలాంటి హార‌ర్ చిత్రాలు స‌క్సెస్ కాకుండా లేవు. ప్ర‌దీప్ తొలి అడుగే ఇలాంటి జోన‌ర్‌తో వ‌స్తున్నాడంటే క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తారు. ట్రైల‌ర్ చూశా చాలా బావుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అని అన్నారు. హీరో మ‌హేష్ మాట్లాడుతూ… స్క్రీన్‌మీద న‌న్ను నేను చూసుకోవ‌డం మొద‌టిసారి. చాలా ఆనందంగా ఉంది. ప్ర‌దీప్ అన్న నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ మాట్లాడుతూ… నాన్న‌గారి పుట్టిన‌రోజు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ అవుతుంద‌ని ముందుగా నేను అనుకోలేదు. స‌డెన్ అలా కుదిరింది. ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రినీ నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. కాని ఎవ్వ‌రూ కూడా విసుగులేకుండా ఒక ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ లాగా బాగా క‌లిసిపోయి అంద‌రూ ప‌ని చేశారు. మీ అంద‌రి న‌వ్వే నా ఎన‌ర్జీ. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

Exit mobile version