‘నా బంగారు తల్లి’ ప్రిమియర్‌కు హాజరయిన సమంత, రెజినా

samantha-ragena
ఒక మంచి ఉద్దేశ్యంతో తీసిన ‘నా బంగారు తల్లి’ చిత్రాన్ని ప్రోత్సహించడానికి అందాల తారలు సమంత, రెజినా, లావణ్య త్రిపాఠి ముందుకు వచ్చారు. బుధవారం రాత్రి ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ప్రివ్యూకి వీరు హాజరయ్యారు. ప్రివ్యూ ప్రదర్శన పూర్తయిన తర్వాత తమ స్పందన తెలియజేస్తారు. ప్రముఖ దర్శకులు దశరథ్, గాయని సునీత తదితరులు కూడా ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.

జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు.. ఇప్పటి వరకూ చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన చిత్రం ‘నా బంగారు తల్లి’. ఈ చిత్రానికి చిరంజీవి, అమల అక్కినేని వంటి ప్రముఖులు, ఎందరో సామాన్య ప్రజలు తమ మద్దతును తెలిపారు. దక్షిణ భారతదేశంలో ప్రజల విరాళాల ద్వారా విడుదలవుతున్న తొలిచిత్రం ‘నా బంగారు తల్లి’. ఈ శుక్రవారం, నవంబర్ 21న ఈ చిత్రం విడుదలవుతుంది.

లైంగిక వేధింపులకు గురయిన ఓ మహిళా నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మానవీయ సంబంధాలకు పెద్దపీట వేశారు. సిద్దిక్, అంజలి పాటిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. సునీత కృష్ణన్ నిర్మాత.

Exit mobile version