పూర్తైన కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ షూటింగ్ !


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ , తమన్నాలు జంటగా నటిస్తున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ చిత్రం యొక్క పూర్తి షూటింగ్ ఈరోజే ముగిసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ ప్యూర్ లవ్ స్టోరీ యొక్క టీజర్ కు మంచి స్పందన రాగా చిత్రాన్ని మే 25న రిలీజ్ చేయనున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version