పబ్లిక్ ప్లేస్ లో నాటు బీట్ తో రెచ్చిపోతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ఫ్యాన్స్!

RRR2
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం ను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు మునుపెన్నడూ కనిపించని రీతిలో ఈ చిత్రం లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.

రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా టాలీవుడ్ లో టాప్ డాన్సర్స్. అయితే వీరిద్దరూ కూడా ఈ చిత్రం లోని నాటు నాటు అంతెం కి కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ఈ పాట సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ నాటు బీటు తో అభిమానులు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఒక వీడియో కి ఆర్ ఆర్ ఆర్ మూవీ స్పందించింది. పబ్లిక్ ప్లేస్ అయిన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్ ధరించి నాటు నాటు పాట కు స్టెప్పులు వేసిన విడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో మాస్ అంటూ ఆర్ ఆర్ ఆర్ మూవీ చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం లో ఒలివియా మోరిస్, అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Exit mobile version