ఈ కాలం హీరోయిన్లు కేవలం నటనకు మాత్రమే పరిమితం కావట్లేదు. భిన్నమైన వ్యాపకాలను ఏర్పరుచుకుని మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. కొందరు హీరోయిన్లు నటనతో పాటు పాటలు పాడితే, ఇంకొందరు అందమైన కవిత్వం రాస్తుంటారు. ఇంకొందరు సంగీత వాయిద్యాలు వాయిస్తూ మెప్పిస్తే కొంతమంది వ్యాపార రంగంలో దూసుకుపోతుంటారు. ఆ కోవలోనే నభా నటేష్ తనలో దాగి ఉన్న ప్రతిభను సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టింది.
ఆమె గీసిన బ్యాట్ మాన్ చిత్రం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. హీరోయిన్ అని పొగడటం కాదు కానీ నిజంగానే నభా గీసిన పెయింటింగ్ గొప్పగానే ఉంది. నభా నటేష్‌కు డీసీ కామిక్ ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన బ్యాట్ మాన్ అంటే ఎంతో ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఆమె తన పెయిటింగ్ ప్రతిభతో మెచ్చుకోదగిన రీతిలో బ్యాట్ మ్యాన్ పెయిటింగ్ వేసి సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు నభా.. నీలో ఇంత మంచి టాలెంట్ ఉందా.. గ్రేట్. నువ్వు మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటరు’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.
