సాంగ్ తో ‘సోగ్గాడే…’ షూటింగ్ ఫినిష్ చేసిన నాగ్

sogade
కెరీర్ ప్రారంభం నుంచి ఒకే రకమైన రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని అటెంప్ట్ చేసిన హీరో కింగ్ నాగార్జున. ‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జున చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’. నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతోంది. గత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైందని తెలియజేశాం. ఈ షెడ్యూల్ చివరి నాలుగు రోజులు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ సాంగ్ ని షూట్ చేసారు. ఈ పాటతో ‘సోగ్గాడే చిన్ని నాయన’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.

చివరిగా షూట్ చేసిన సాంగ్ లో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, అనసూయ, హంసా నందిని, నాజర్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ పాటకో స్పెషాలిటీ ఉంది. ఈ పాటలో నాగార్జున 1990 టైంకి చేసిన స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. అంతే కాకుండా ఈ గెటప్ లో నాగార్జున కుర్రాడిలా కనిపించనున్నాడు. రెండు డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున వేరు వేరు గెటప్స్ లో కనిపిస్తాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.

‘సోగ్గాడే చిన్ని నాయన’ షూటింగ్ ఫినిష్ చేసిన నాగార్జున కార్తీ తో కలిసి చేస్తున్న వంశీ పైడిపల్లి సినిమా కోసం యూరప్ బయలుదేరనున్నాడు. మరో నెల రోజుల యూరప్ లో షూట్ జరుపుకోనున్న ఈ సినిమాకి ‘దోస్త్’ అనే టైటిల్ ని పెట్టారని సమాచారం.

Exit mobile version