అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ కి ముగ్గురు కొరియోగ్రాఫర్స్.!

Akhil
అక్కినేని ఫ్యామిలీ మూడవతరం యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఫస్ట్ మూవీ కోసం టాలీవుడ్ తో పాటు, తెలుగు సినిమా అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ 85% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ మరియు 2 సాంగ్స్ ని షూట్ చేయడం కోసం ఈ చిత్ర టీం ఇటీవలే స్పెయిన్ వెళ్లారు. ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్న ఈ చిత్ర టీం త్వరలోనే సాంగ్స్ షూట్ చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఫైనల్ సాంగ్ షూట్ ని ఓ స్పెషల్ సెట్లో షూట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయనున్నాం..

ఈ సినిమాలో అఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని ఇటీవలే షూట్ చేసారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సాంగ్ ని ముగ్గురు కొరియోగ్రాఫర్స్ కలిసి ఈ సాంగ్ ని చాలా స్పెషల్ గా కంపోజ్ చేసారు. ఎడిటింగ్ రూం లో ఈ సాంగ్ రఫ్ కట్ చూసిన కింగ్ నాగార్జున సాంగ్ చాలా బాగా వచ్చిందని చాలా హ్యాపీ అయ్యాడట. అంతే కాకుండా వెంటనే స్పెషల్ గా ఆ ముగ్గురు కొరియోగ్రాఫర్స్ కి కాల్ చేసి వాళ్ళని మెచ్చుకున్నాడట. వివి వినాయక్ ఎంతో స్పెషల్ కేర్ తీసుకొని అఖిల్ కి పర్ఫెక్ట్ లాంచ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా కనిపించనుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version