చైతూ-గౌతమ్ మీనన్‌ల సినిమా ఎప్పుడు?

Naga-Chaitanyas-first-look
లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా తానేంటో నిరూపించుకున్న నాగ చైతన్య.. తాజాగా కాన్ మ్యాన్‌గా మన ముందుకొచ్చారు. ‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త దారిని చూపిన దర్శకుడు సుధీర్ వర్మ నాగ చైతన్యతో తెరకెక్కించిన సినిమాయే ‘దోచేయ్’. ఇందులో మోసం, దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించి నాగ చైతన్య అందరినీ అలరించారు. గత శుక్రవారం (ఏప్రిల్ 24న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల వద్ద నుండి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.

ఈ సందర్భంగా నాగచైతన్యతో మీడియాతో ముచ్చటించారు. తన తరువాతి సినిమాల గురించి చెబుతూ.. ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటితో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టే కాక గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా కోసం ఎప్పట్నుంచో చూస్తున్నానని, అన్నీ కుదిరితే త్వరలోనే ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేస్తానని నాగచైతన్య ప్రకటించారు. మనకు అందుతున్న సమాచారం మేరకు చైతూ చందూ సినిమాను ఫినిష్ చేసిన తర్వాత గౌతమ్ మీనన్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది.

Exit mobile version