స్విట్జర్ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన నాగ చైతన్య

naga-chaitanya
యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం స్విట్జర్ల్యాండ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య చేస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్ లోని ఇంటర్ లేకన్ లో షూటింగ్ జరుగుతోంది. స్విట్జర్ ల్యాండ్ లోని ఈ అందమైన ప్రాంతంలోని సరస్సుల దగ్గర షూటింగ్ చేస్తున్నారు.

నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత వీరిద్దరూ కలిసి వెళ్లి పారా గ్లైడింగ్ లాంటివి చేస్తూ బాగా ఎంజాయ్ చేసారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version