భార్య శోభితకు స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన నాగచైతన్య

Untitled 19

అక్కినేని నాగచైతన్య, శోభిత ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుని ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. ఇక శోభిత మే 31న తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా ఆమె భర్త, హీరో నాగచైతన్య ఆమెకు స్పషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ఆమెతో దిగిన ఓ క్యూట్ ఫోటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసి ఆమెకు తన లవ్లీ విషెస్ తెలిపాడు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై లేడీ’’ అంటూ తన ప్రేమను మరోసారి వ్యక్త పరిచాడు.

ఇక ఈ ఫోటోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. శోభిత పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ కూడా ఆమెకు విషెస్ తెలియజేశారు.

Exit mobile version