అక్కినేని అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’ గ్రాండ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. రహస్యాలు, పురాతన కథల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ వరల్డ్‌లోకి ప్రేక్షకులను ఆహ్వానిస్తూ డిసెంబర్ 4, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“కొన్ని కథలు చెప్పబడతాయి, కొన్ని వెలికితీయబడతాయి… కానీ కొన్ని మాత్రమే ఉద్భవించడానికి వేచి చూస్తాయి” అంటూ చిత్ర బృందం విడుదల చేసిన కాన్సెప్ట్ పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ అందుకుంటుందో చూడాలి.
