
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన పలు టైటిల్ రూమర్స్ ని డైరెక్టర్ సుధీర్ వర్మ కొట్టి పారేసాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘హరిలో రంగ హరి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కానీ ఈ తిలే ని ఇప్పటికే వేరేవాళ్ళు రిజిస్టర్ చేయడం వలన ఈ చిత్ర టీం వారి దగ్గర నుంచి ఈ టైటిల్ ని తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఫైనల్ గా ఈ చిత్ర టీం ఆ టైటిల్ ని తీసుకుంటారా.? లేక వేరే ఏదైనా ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికయితే ఈ చిత్ర టీం అంతా ‘హరిలో రంగ హరి’ అనే టైటిల్ పై మక్కువ చూపుతున్నారు.
నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.