
‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్లో శింబు హీరోగా నటిస్తుండగా, మంజిమా మోహన్ రెండు వర్షన్స్లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను దర్శక నిర్మాతలు దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో సినిమా మూడ్, డైలాగ్స్, నాగ చైతన్య ఎక్స్ప్రెషన్స్, ఫ్లేవర్ అంతా ‘ఏ మాయ చేశావే’ను పోలి ఉండడంతో ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవంబర్ మొదటివారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గౌతమ్ మీనన్ స్టైల్లో సెన్సిబుల్ లవ్, యాక్షన్ అంశాలను మేళవించుకున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.