విజువల్ ట్రీట్ తో ఆకట్టుకుంటున్న ‘వృషకర్మ’ గ్లింప్స్‌ !

Vrushakarma

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వృషకర్మ’ ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పైగా పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రానుంది. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా దీని గ్లింప్స్‌ను విడుదల చేశారు. చైతూ ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో అర్జున్‌ అనే నిధి అన్వేషకుడిగా కనిపించబోతున్నారు. చైతుకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మొత్తానికి ఈ గ్లింప్స్‌ చాలా బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈ గ్లింప్స్‌తో ‘వృషకర్మ’లో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య చేసే అడ్వెంచర్ ప్రేక్షకులను ఖచ్చితంగా కట్టిపడేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version