నాగ చైతన్య బర్త్ డే టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్

Naga-Chaitanya's-first-look
అక్కినేనినాగార్జున కి నట వారసుడిగా పరిచయం అయిన నేటితరం యంగ్ హీరో నాగ చైతన్య. ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ చైతన్య ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ టీజర్ కి అభిమానుల నుంచి, సోషల్ నెట్వర్క్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దొంగతనం అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో మొదటి సినిమా చేసిన సుదీర్ వర్మ, తన సెకండ్ సినిమాకి కూడా అదే ఫార్ములాని ఎంచుకున్నాడు.

ఒక దొంగ చుట్టూ తిరిగే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ‘ప్రతి మోసం వెనక ఇద్దరు ఉంటారు.. మోసం చేసేవాడు, మోసపోయేవాడు.. నువ్వు రెండవ వాడివి కాకూడదు అంటే మొదటి వాడివి అయ్యి తీరాలి’ అని టీజర్ లో చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ విషయంలో చాలా పేర్లను పరిశీలిస్తున్నారు.

నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నాగ చైతన్య న్యూ మూవీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి — ఫస్ట్ టీజర్

Exit mobile version