‘నాగబంధం’ నిడివి ఖరారు.. ఆసక్తికరమైన ప్రమోషన్స్ !

యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ అవైటెడ్ పాన్‌-ఇండియా సినిమా “నాగబంధం”. ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. భారీ సినిమాల నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రాబోతుంది. 2026 జులై 3న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ఆసక్తికరమైన ప్రమోషన్స్ లో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఐతే, తాజా సమాచారం ప్రకారం, ‘నాగబంధం’ నిడివి సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఖరారైంది.

మరి సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం యొక్క జానర్ మరియు కథాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అత్యున్నత నిర్మాణ విలువలు మరియు విస్తృతమైన VFX పనులతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్ మరియు రిషబ్ సాహ్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version