రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘నాగబంధం’.. వచ్చేది ఎప్పుడంటే..?

Nagabandham 2

అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ ఈ ఏడాది టాలీవుడ్ నుండి వస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలను పెంచడమే కాకుండా సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.

మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ‘నాగబంధం’ జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో సందడి చేయనుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విరాట్ కర్ణ, నభా నటేష్ మరియు ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ చిత్రంలో జగపతి బాబు, మురళీ శర్మ, జయప్రకాష్, బి.ఎస్.అవినాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కిషోర్ అన్నపురెడ్డి మరియు నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జునేద్ కుమార్ మరియు అభి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version