‘నాగబంధం’ ట్రైలర్ లాంచ్‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతన్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘నాగబంధం’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని జూలై 3న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ స్క్రీన్‌లో జూన్ 19న లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ అవ్వగా, ఈ ట్రైలర్‌తో సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, అనసూయ, మురళీ శర్మ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. మరి హైదరాబాద్‌లోనే పెద్ద స్క్రీన్ అయిన ప్రసాద్స్ పీసీఎక్స్‌లో నాగబంధం అద్భుతమైన విజువల్స్ ఇంకెంత గ్రాండ్‌గా కనిపిస్తాయో చూడాలి.

Exit mobile version