
ఎప్పటికప్పుడు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే కింగ్ నాగార్జున ఈ సారి కళ్యాణ్ కృష్ణ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ సినిమా కోసం వేసిన ఓ స్పెషల్ హౌస్ సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రముఖ నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
నాగర్జున డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మొత్తంగా 5 మంది హీరోయిన్స్ ఆయన సరసన కనిపించనున్నారు. అందులో లావణ్య త్రిపాటి, రమ్యకృష్ణ మెయిన్ హీరోయిన్స్ అయితే, హంసా నందిని ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది ఎలియాల్సి ఉంది. ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.