వైల్డ్ డాగ్ సెల్యూట్ ఇండియన్ పోలీస్..!

Nagarjuna

దేశం రెండు నెలలుగా ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా అల్లాడుతోంది. లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలీలు మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. మరో ప్రక్క ఈ యుద్ధంలో ప్రజలను కాపాడే బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకుంది. వారు ప్రజల క్షేమం కోసం నిరవధిక సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచిన పోలీసుల సేవా భావాన్ని కింగ్ నాగార్జున కొనియాడారు. మరియు ఏపీ పోలీసులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కాగా గత ఏడాది మన్మథుడు 2 మూవీతో అలరించిన నాగార్జున ప్రస్తుతం ఓ పోలీస్ డ్రామా చేస్తున్నారు. ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున ఈ చిత్రంలో చేస్తుండగా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లా కనిపిస్తారని వినికిడి. వైల్డ్ డాగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి అహీషోర్ సోలొమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నిర్మాతగా నాగార్జున ఉన్నారు.

Exit mobile version