బాలీవుడ్ సెన్సేషన్ ‘ధురంధర్’(Dhurandhar) సినిమాలో అక్షయ్ ఖన్నా చేసిన పవర్ఫుల్ విలన్ రోల్ కోసం మొదట టాలీవుడ్ కింగ్ నాగార్జునను సంప్రదించారనే వార్త నెట్టింట హల్చల్ చేసింది. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా వల్ల నాగ్ ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నారనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ఆ పాత్ర కోసం తనను ఎవరూ అడగలేదని నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సినిమాపై నాగ్ ప్రశంసలు కురిపించారు. ‘ధురంధర్’ ఒక అద్భుతమైన చిత్రమని, అందులో అక్షయ్ ఖన్నా నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని కొనియాడారు. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్ అంటే తనకు ఇష్టమని, ఆయన గత చిత్రం ‘ఉరి’ కూడా తనకు ఫేవరెట్ అని నాగార్జున పేర్కొన్నారు.
ధురంధర్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో, దీనికి రాబోయే సీక్వెల్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నాగ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
