ఓన్లీ యాక్షన్ అంటున్న నాగార్జున !

నాగార్జున, రామ్ గోపాల్ వర్మలు కలిసి చేస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ మొత్తాన్ని హెవీ యాక్షన్ సన్నివేశాలతో నింపేసిన వర్మ ఈ పోలీస్ డ్రామా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

ఈ మధ్య కాలంలో అన్నీ సెన్సిటివ్ కథల్ని, ఫ్యామిలీ డ్రామాల్ని మాత్రమే చేస్తూ వచ్చిన నాగ్ ఒక్కసారిగా ఇలా విధ్వంసకరమైన యాక్షన్ అవతారంలో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి ఇంకాస్త పెరిగింది. అంతేగాక నాగార్జున టీజర్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ అలరిస్తున్నారు కూడ. మరి ఈ ఇనిమతో వర్మ, నాగార్జునలు ‘శివ’ మ్యాజిక్ ను రిపీటీ చేస్తారేమో చూడాలి. 2మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి :

Exit mobile version