విద్యాబాలన్ కు నాగార్జున పెద్ద ఫ్యాన్ అట..

nagarjuna-vidyabalan
కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాలో బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ షోలో విద్యాబాలన్ ప్రత్యేక అతిధిగా విచ్చేసింది. ఆమెతో చిత్రీకరించిన ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని షో నిర్వాహణ బృందమంతా తెలిపింది

నాగార్జున ఈరోజు విద్యాబాలన్ పై ప్రశంసల జల్లును కురిపించాడు. ఆమెకు తాను పెద్ద ఫ్యాన్ ని అని తెలిపాడు. ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పరిణీత సినిమా తనకు ఎంతో ఇష్టమని ఆయన ట్వీట్ ల ద్వారా తెలిపాడు

నాగార్జున ప్రస్తుతం తన తదుపరి సినిమాని మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.ఎన్.టి.ఆర్ హీరో. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది

Exit mobile version