చలో దుబాయ్ అంటున్న నాగ్ – కార్తీ

nagarjuna-karthi
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ మల్టీ స్టారర్ మూవీ మొదలైంది. ఈ మల్టీ స్టారర్ స్పెషాలిటీ ఏమిటంటే ఇరు భాషలకు చెందిన స్టార్ హీరోస్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరూ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు కావడం విశేషం. టాలీవుడ్ కింగ్ నాగార్జున – కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కలిసి నటిస్తున్న సినిమానే ఆ మల్టీ స్టారర్ బొమ్మ. గత నెల మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకున్న ఈ సినిమా ఆ తర్వాత చెన్నైలో ఓ కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది.

మే చివరు వారంలో ఈ చిత్ర టీం దుబాయ్ వెళ్లనుంది. అక్కడ టాకీ పార్ట్ కి సంబందించిన ఓ మేజర్ షెడ్యూల్ తో పాటు పాటలని కూడా షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో నాగార్జున – కార్తీల సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. వంశీ పైడిపల్లి పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పివిపి నిర్మించనున్నాడు. ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తాడు. ఈ సినిమాలో రొమాంటిక్ అంశాలతో పాటు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఫుల్ గా ఉంటాయని సమాచారం.

Exit mobile version