యువహీరోలను ఓడిస్తున్న నాగార్జున

యువహీరోలను ఓడిస్తున్న నాగార్జున

Published on Jun 21, 2014 6:55 PM IST

Nagarjuna
అక్కినేని అందగాడు నాగార్జున వయసు 50దాటినా ఇంకా అదే బాడీని,స్టైల్ ని కొనసాగిస్తున్నాడు.నాగార్జున తన పర్సనాలిటీని మైంటైన్ చేస్తున్న తీరు కుర్రకారుకి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది.

ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం టాలీవుడ్ లో మోస్ట్ డిసైరెబుల్ మెన్ లిస్టులో నాగార్జున చాలా మంది కుర్రహీరోలను అధిగమించి 9వ స్థానంలో నిలిచాడు.మొదటినుంచి నాగార్జునకు మహిళా అభిమానులు ఎక్కువే.అదీకాక వయసుతో పాటు అయన అందం పెరిగిపోతుంది.ఈ లిస్టులో మహేష్ బాబు మొదటి స్థానంలో నిలవగా ప్రభాస్,నితిన్ లు 2,3 స్థానాల్లో నిలిచారు.

తాజా వార్తలు