
కింగ్ నాగార్జున మరియు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కాంబినేషన్లో ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి. వాటికంటే మించి వీరి కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలు ఎక్కువ పేరు గాంచాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో మరో భక్తిరస చిత్రం రాబోతోందని తెలియజేశాం.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం నాగార్జున – రాఘవేంద్ర రావుల మరో భక్తిరస చిత్రం ఏప్రిల్ రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర స్వామి నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. మరి వరుసగా మూడు డివోషనల్ మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాగార్జున – రాఘవేంద్ర రావు ఈ సినిమాతో మరో సారి ఆ మేజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి. నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

