‘కూలీ’లో అదిదా సర్‌ప్రైజ్ అనాల్సిందే..!

COOLIE Rajinikanth

యావత్ ఇండియన్ ప్రేక్షకులు రేపు(ఆగస్టు 14) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెండు బడా చిత్రాలు పోటీ పడుతూ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ‘వార్ 2’.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాల్లో ‘కూలీ’ చిత్రం దక్షిణాదిన ప్రభావం ఎక్కువగా చూపుతున్నట్లు ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ‘కూలీ’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కూలీ చిత్రంలో అందరి చూపు రజినీకాంత్ పై ఉంటే, ఈ సినిమాలో పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కింగ్ నాగార్జున సిద్ధంగా ఉన్నాడు.

ఈ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఆయన ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని వయొలెంట్ పాత్రలో మనకు కనిపిస్తాడట. ఈ పాత్ర అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా లోకేష్ తీర్చిదిద్దాడట. మరి రజినీ ఫ్యాన్స్‌ను సైతం సర్‌ప్రైజ్ చేయబోతున్న నాగ్, ఎంత విధ్వంసకర పాత్రలో కనిపిస్తాడా అనేది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.

Exit mobile version