అఖిల్ ‘లెనిన్’కు నాగ్ సూచనలు !

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఐతే, ఇప్పటికే ఫైనల్ కట్ ఎడిటింగ్ పూర్తి అయిందని.. నాగార్జున ఫైనల్ కట్ వెర్షన్ ను చూసి కొన్ని సలహాలను సూచించారు అని తెలుస్తోంది. ఆ సలహాలకు అనుగుణంగా కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయనున్నారట. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.

Exit mobile version