నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా ‘తుగ్లక్’. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు. కాగా ఇప్పుడు విరించి వర్మ నందమూరి కళ్యాణ్ రామ్కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసిననట్లు తెలుస్తోంది. మేలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగతుందట. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రటకన రానుంది.
ఇక ఇటీవలే 118 తో మంచి హిట్ కొట్టాడు కళ్యాణ్ రామ్. కే వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకుంది.
